Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడ్వాన్సులిచ్చిన నిర్మాతలు వెనక్కి వెళ్లిపోయారు: దర్శకుడు వీరభద్రం చౌదరి

  • వరుసగా రెండు హిట్లు ఇచ్చాను
  •  పదిమంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు
  •  'భాయ్' ఫ్లాప్ తో గ్యాప్ వచ్చింది   
వీరభద్రం చౌదరి తెరకెక్కించిన చిత్రాలలో 'భాయ్' సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమాను గురించి ప్రస్తావించాడు. "నేను దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్లంట' .. 'పూల రంగడు' సినిమాలు సూపర్ హిట్లు కావడంతో, పదిమంది నిర్మాతలు వచ్చి నాకు అడ్వాన్సులు ఇచ్చారు.

అన్నపూర్ణ బ్యానర్లో అవకాశం రావడమే అదృష్టంగా భావించి, ముందుగా నాగార్జునగారితోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఆయనతో చేసిన 'భాయ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో, అంతకుముందు నాకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు వెనక్కి వెళ్లిపోయారు. దాంతో కాస్త గ్యాప్ వచ్చింది .. ఆ తరువాత ఆది సాయికుమార్ తో 'చుట్టాలబ్బాయి' చేశాను" అని చెప్పుకొచ్చారు.
veerabhadram

More Telugu News